BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 04:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుఫానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Oct, 2026 - 04:19 PM
28 వీక్షణలు

 ప్రజలు ఆందోళన చెందవద్దు హోం మంత్రి వంగలపూడి అనిత

ప్రభుత్వం అండగా ఉంటుంది హోంమంత్రి వంగలపూడి అనిత

ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎదుర్కొనేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112కు ఫోన్ చేసి సమాచారం అందించాలని హోంమంత్రి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.