ఈ నెల 30న పోచారంలో ఇన్ఫోసిస్ నూతన భవనం ప్రారంభించనున్న సీఎం
- పోచారంలో ఇన్ఫోసిస్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
- హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి
ఘట్‌కేసర్ (ఎన్ టుడే న్యూస్): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారంలో ఈ నెల 30న ఇన్ఫోసిస్ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి సోమవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
హెలిప్యాడ్ ఏర్పాట్లపై సమీక్ష
పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పనులు పకడ్బందీగా చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) అధికారులకు సూచనలు, సలహాలు అందించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
అధికారుల హాజరు
ఈ పరిశీలనలో కీసర ఆర్డీవో వెంకటరెడ్డి, ఘట్‌కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్, జిల్లా ఆర్ అండ్ బీ ఈఈ జలంధర్, ఇన్ఫోసిస్ ప్రతినిధులు పాల్గొన్నారు.