లంచం కేసులో పంచాయతీ కార్యదర్శికి రెండేళ్ల జైలు శిక్ష
అవినీతి కేసులో శాయంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి కుర్రు కుమారస్వామిని దోషిగా నిర్ధారిస్తూ వరంగల్ ప్రత్యేక ఏసీబీ కోర్టు 2026 అక్టోబర్ 26న తీర్పు వెలువరించింది. ఆయనకు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.
కేసు వివరాల ప్రకారం.. 2008 సెప్టెంబర్ 6న ఇంటి అద్దె బిల్లు తయారు చేయడం, సుమారు రూ.25,500 చెల్లింపునకు సంబంధించిన చెక్కు జారీ చేయడం కోసం ఫిర్యాదుదారుడి నుంచి కుమారస్వామి రూ.4,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు కేసు నమోదైంది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన వరంగల్ ప్రత్యేక ఏసీబీ కోర్టు, అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్లు 7, 13(2) రెడ్‌విత్ 13(1)(d) కింద కుమారస్వామిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష విధించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.