BREAKING
thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం
Date of Publish : 23 September 2026, 07:12 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 07:12 AM
11 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు అందించే పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా జారీ చేసిన మెమో నంబర్ 3336974 ప్రకారం పింఛన్ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలుగా విభజించి అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా అయిన ఎన్‌ఎస్‌ఏపీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా వాటాను గతంలో మాదిరిగానే ఇంటి వద్ద నగదు రూపంలో అందించనున్నారు.

వృద్ధాప్య పింఛన్ 60 నుంచి 79 ఏళ్ల వయసు ఉన్న వారికి బ్యాంకు ఖాతాలో రూ.200 జమ కాగా, ఇంటి వద్ద రూ.3,800 నగదు అందుతుంది. మొత్తంగా రూ.4,000 పింఛన్ అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వారికి బ్యాంకులో రూ.500 జమ చేసి, ఇంటి వద్ద రూ.3,500 నగదు అందిస్తారు. వీరికి కూడా మొత్తం రూ.4,000 పింఛన్ లభిస్తుంది.

వితంతు పింఛన్ 40 నుంచి 79 ఏళ్ల వయసు ఉన్న వితంతువులకు బ్యాంకు ఖాతాలో రూ.300 జమ కాగా, ఇంటి వద్ద రూ.3,700 నగదు అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వారికి బ్యాంకులో రూ.500 జమ చేసి, ఇంటి వద్ద రూ.3,500 నగదు అందిస్తారు. రెండు వర్గాల లబ్ధిదారులకు కలిపి మొత్తం రూ.4,000 పింఛన్ అందుతుంది.

వికలాంగుల పింఛన్ 18 నుంచి 79 ఏళ్ల వయసు ఉన్న వికలాంగులకు బ్యాంకు ఖాతాలో రూ.300 జమ కాగా, ఇంటి వద్ద రూ.5,700 నగదు అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వారికి బ్యాంకులో రూ.500 జమ చేసి, ఇంటి వద్ద రూ.5,500 నగదు అందిస్తారు. వయసుతో సంబంధం లేకుండా మొత్తం పింఛన్ రూ.6,000గా ఉంటుంది.

ఈ మార్పుతో లబ్ధిదారులకు అందే మొత్తం పింఛన్‌లో ఎలాంటి తగ్గింపు ఉండదని ప్రభుత్వం పేర్కొంది. కేవలం పింఛన్‌లోని కేంద్ర ప్రభుత్వ వాటా బ్యాంకు ఖాతాలో జమ అవుతుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నగదు రూపంలో ఇంటి వద్ద అందుతుంది. దీంతో లబ్ధిదారులకు గతంలో లభిస్తున్న పూర్తి పింఛన్ మొత్తమే కొనసాగుతుంది.