BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 08:27 pm
Posted by : NAGARAJU GADE

నూతన ఎంపీపీగా కొల్ల యశస్సు కుమార్ ప్రమాణ స్వీకారo.

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
19 Nov, 2026 - 08:27 PM
20 వీక్షణలు

సంతకవిటి, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): విజయనగరం జిల్లా సంతకవిటి మండల నూతన ఎంపీపీగా కొల్ల యశస్సు కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎన్నికల అధికారి వెంకటప్పలనాయుడు నూతన ఎంపీపీగా కొల్ల యశస్సు కుమార్, వైస్ ఎంపీపీగా గొల్లపల్లి రామోజీరావుతో పాటు ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొల్ల అప్పలనాయుడు నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీపీ కొల్ల యశస్సు కుమార్ మాట్లాడుతూ.. సంతకవిటి మండల సమగ్ర అభివృద్ధికి నూతన పాలకవర్గం అంకితభావంతో కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూస్తానన్నారు. మండలంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు. సంతకవిటి మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సంతకవిటి మండల టీడీపీ అధ్యక్షుడు గట్టి భాను, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లూరు గణేష్, మండల జడ్పీటీసీ వల్లూరు సంగీత, మండల పీఏసీఎస్ చైర్మన్ చెలికాన మహేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.