పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం
గడ్డిఅన్నారం సెప్టెంబర్ 30/ ఎన్ టుడే న్యూస్.
గడ్డిఅన్నారం డివిజన్‌కు చెందిన పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు పున్న శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశాలి సంఘం అభివృద్ధికి, అలాగే సమాజ సేవకు ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ అవార్డును అందజేశారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంత్యుత్సవాల సందర్భంగా.. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మినీ హాల్‌లో సోమవారం అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుమ్మ సత్యనారాయణ చేతుల మీదుగా పున్న శ్రీనివాసులు ఈ అవార్డును అందుకుని సత్కారం పొందారు.
ఈ గౌరవప్రదమైన కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు బైరీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సురేపల్లి రవికుమార్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ అలీ, ప్రముఖ నాట్యగురువు డాక్టర్ దుపర్తి అనిత, షోలాపూర్‌కు చెందిన ప్రముఖ సమాజ సేవకుడు అశోక్ ఇందూపురి తదితర ముఖ్య నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు.