BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 04:08 pm
Posted by : M. రాజశేఖర్

ఖాఖీ చొక్కా పుస్తకావిష్కరణ చేసిన కుప్పం ఏఎస్పీ

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
25 Sep, 2026 - 04:08 PM
14 వీక్షణలు

‘ఖాఖీ చొక్కా’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కుప్పం ఏఎస్పీ హేమంత్ బొడ్డు

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం జరుగు గ్రామానికి చెందిన రచయిత టీ. పుష్ప శేఖర్ రచించిన ‘ఖాఖీ చొక్కా’ పుస్తకాన్ని కుప్పం ఏఎస్పీ హేమంత్ బొడ్డు శుక్రవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో పోలీసుల పాత్ర, వారు అందిస్తున్న సేవలను ప్రతిబింబించేలా పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు. సమాజానికి ఉపయోగపడే అంశాలను ప్రతిబింబించే పుస్తకాలు మరిన్ని వెలువడాలని ఆకాంక్షించారు.

పుస్తక రచయిత పుష్ప శేఖర్ మాట్లాడుతూ ‘ఖాఖీ చొక్కా’ ద్వారా పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజలకు వారు అందించే సేవలను పాఠకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో సాయిమాత సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబు, రిటైర్డ్ టీచర్ వెంకటేష్, ఎం. రాజశేఖర్, స్థానిక పోలీసు సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.