BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 02:05 pm
Posted by : PAGADALA DEVAIAH

ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించిన కార్మిక నాయకులు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
19 Nov, 2026 - 02:05 PM
41 వీక్షణలు

దేశ సమగ్రత, అభివృద్ధికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం: బ్యాగరి అనంతయ్య

ఎల్బీనగర్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మలక్‌పేట నియోజకవర్గంలోని దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో ఉన్న ఆమె విగ్రహానికి కార్మిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బ్యాగరి అనంతయ్య మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ఇందిరాగాంధీ జీవితం గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు. ధైర్యం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తికి ఆమె నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్‌రావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గంట సుదర్శన్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్–జగ్జీవన్‌రావు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌రావు, గ్రేటర్ హైదరాబాద్ కార్మిక సంఘం అధ్యక్షుడు చింతపల్లి కాశీనాథ్, జీహెచ్‌ఎంసీ నాయకులు జి. గోపాల్, శ్రీనివాస్, నరసింహ, లక్ష్మణ్ బీమ్, మలక్‌పేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.