BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 07 August 2026, 05:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లింగపాలెం జడ్పీ హైస్కూల్‌లో పోలీసుల అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:14 PM
87 వీక్షణలు

లింగపాలెం: విద్యార్థులకు అత్యవసర టోల్‌ఫ్రీ నంబర్లు, రహదారి భద్రతపై ధర్మాజీగూడెం పోలీసులు అవగాహన కల్పించారు. లింగపాలెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచించారు. 112 ద్వారా అత్యవసర పోలీసు, అగ్నిమాపక, వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. 181 మహిళల రక్షణ, సహాయం కోసం, 1098 బాలల సంరక్షణ కోసం, 1930 సైబర్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగించుకోవాలని వివరించారు.

రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విద్యార్థులకు తెలిపారు. తాము తెలుసుకున్న విషయాలను ఇంట్లోని పెద్దలు, చుట్టుపక్కల వారికి తెలియజేసి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.