BREAKING
thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
Date of Publish : 16 September 2026, 07:59 pm
Posted by : NTODAY NEWS

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
16 Sep, 2026 - 07:59 PM
26 వీక్షణలు

సెప్టెంబర్ 17 వారోత్సవాలను జయప్రదం చేద్దాం -citu

హైదరాబాద్/ఎన్ టుడే న్యూస్.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక అడ్డాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు జి.రాములు గారు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిందని, భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలతో నిజాం నిరంకుశత్వం కు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో సాగిన పోరాటం, ఈ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ఎస్, బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తూ కమ్యూనిస్టు న్యాయకత్వాన్ని పోరాటాన్ని అవమాన పరుస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న సాయుధ పోరాట ఫలితంగా విలీనమైంది. 1946 ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తిలో చిట్యాల ఐలమ్మ పండించిన పంటను అక్రమంగా దోచుకోవాలని చూసిన విసునూరు రామచంద్రారెడ్డి ని, భీమిరెడ్డి నరసింహారెడ్డి బృందం సహకారంతో అయిలమ్మ తిరగబడి తన భూమిని పంటను కాపాడుకుంది. భూస్వాముల దోపిడీని దౌర్జన్యాలు ఎదిరిస్తూ కడివెండ లో ప్రదర్శన చేస్తున్న ప్రజలపై ముసునూరు గుండాల కాలుపుల్లో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు 1946 జులై నుండి 1948 సెప్టెంబర్ వరకు 1500 మంది కమ్యూనిస్టులను రైతులను, భూస్వాములు రజాకాలు కాల్చి చంపారు సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టులు, రజాకార్లను నిజాం సర్కారును అణిచివేస్తారని అనుకున్న నెహ్రూ ప్రభుత్వానికి ఇది సాధ్యం కాకపోవడంతో భారతదేశ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని రంగంలోకి దింపి నరహంతకుడైన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ శిక్షించకుండా నిజాం రాజ్య ప్రముఖ గా ప్రకటించి సకల సౌకర్యాలు కల్పించి నిజాం రాజుతో నెహ్రూ పటేల్ ప్రభుత్వం రాజీపడడానికి తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. పటేల్ సైన్యం రాకపోతే నిజాం రాజరికం కుప్పకూలేది భూస్వామ్య వ్యవస్థ రద్దయి దున్నేవాడికి భూమి దక్కిది. తెలంగాణ కమ్యూనిస్టుల వర్షం అయ్యేది, నిజాం రాజు నరహంతకుడు రజాకా నాయకుడు కాసిం రాజ్విని ప్రజా కోర్టు లో శిక్షించేవారు, నిజాం రాజును కాసిం రజ్విన్, భూస్వాములు పటేల్ సైన్యం కాపాడింది. కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదల స్వాధీనం చేసుకున్న భూములను మళ్లీ భూస్వామ్యం కప్పగించారు. వారికి భద్రత కల్పించి నెహ్రూ పటేల్ ప్రభుత్వం 2,500 మంది కమ్యూనిస్టు నాయకులను, కార్యకర్తలను, పటేల్ సేన చంపింది. అయినా పోరాటాన్ని అనచడం సాధ్యం కాకపోవడంతో భూమి పంచకుండా హక్కులు కల్పించకుండా పోరాటం ఆగదని ప్రభుత్వానికి అర్థమైంది. దీంతో  రక్షిత కవులుదారి చట్టం 1951 లో ప్రకటించి. భూ సంస్కరణలు అమలు చేస్తామని వాగ్దానం చేసింది. నేపథ్యంలో 1951 అక్టోబర్ 21న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించారు.

 తమ రాజకీయ ప్రయోజనాల కోసం సాయుధ పోరాటానికి మతం రంగు రుద్ది హిందూ ముస్లిమ్ మధ్యన జరిగిన పోరాటంగా ముస్లిం రాజు నుండి తెలంగాణ విమోచన జరిగిందని చరిత్రను వక్రీకరిస్తున్నారు . దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణకు వారు చేసింది ఏమీ లేదు భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పారిశ్రామికవేత్తల లాభాల కోసం నాలుగు లేబర్ కోల్డ్ గా తీసుకొచ్చింది విద్య వైద్యం అభివృద్ధి తో ప్రజలపై అనేక భారాల మోప్పుతోంది. ప్రభుత్వంగ సంస్థలను కార్పొరేట్ సంస్థల కు కారు చౌకగా కట్టబెడుతుంది. విద్యా వైద్య రంగాలను కార్పొరేట్ సంస్థల పరం చేస్తున్నది. మత విద్వేషణ సృష్టించి లౌక్యవాదాన్ని దెబ్బతిస్తుంది. రాజకీయ లబ్ధి కోసం చరిత్రంగా తెలంగాణ సాయుధ పోరాటాలని వక్రీకరించి, ఆర్ఎస్ఎస్ బిజెపి విధానాలను తిప్పి కొట్టాలని సిఐటియు పిలుపునిస్తుంది.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేష్. బిక్షపతి. చిట్టి రాజు, నారాయణ, కొండబాబు, మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు.