గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాలి: సీపీఐ సీనియర్ కామ్రేడ్ జిల్లా లక్ష్మయ్య
చిట్యాల: గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని సీపీఐ గ్రామ శాఖ సీనియర్ కామ్రేడ్ జిల్లా లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.
గురువారం గుండ్రాంపల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోడిగే సైదులు సీపీఐ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని వారు వారోత్సవాలను నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం సరికాదని, చరిత్రను వాస్తవాల ఆధారంగా భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి జిల్లా సత్యం, సహాయ కార్యదర్శులు కేతరాజు అంజయ్య, సీమ అంజయ్య, శాఖ కామ్రేడ్స్ ఏర్పుల రాములు, బొమ్మల శంకర్ రెడ్డి, రత్నం లింగస్వామి, పానుగుల శివ తదితరులు పాల్గొన్నారు.