BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 17 September 2026, 10:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బెయిల్ కోసం రూ.10 లక్షల డిమాండ్..

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Sep, 2026 - 10:18 AM
24 వీక్షణలు

బెయిల్ కోసం రూ.10 లక్షల డిమాండ్.. రూ.5 లక్షలు తీసుకుంటూ కీసర ఎస్సై అరెస్ట్

మేడ్చల్ జిల్లా: బెయిల్ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన కీసర పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.

ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు కీసర సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని నిందితుడిపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. సీఐ ఆదేశాల మేరకు రూ.5 లక్షల లంచం తీసుకుంటున్న ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని కీసర చెరువుగట్టు వద్ద అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం సీఐ ఆంజనేయులును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లంచం డిమాండ్, స్వీకరణకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.