BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 16 September 2026, 02:55 pm
Posted by : PAMMI NAVEENKUMAR

కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
16 Sep, 2026 - 02:55 PM
14 వీక్షణలు

కొత్తపేట / NToday News: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

అనంతరం నియోజకవర్గంలో రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులతో పాటు మండల పార్టీ బాధ్యతలు చేపట్టిన నాయకులకు చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డులను అందజేశారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తిస్తూ వారికి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలని సూచించారు.

ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి, పాలనకు సంబంధించిన అంశాలను గడపగడపకు తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పార్టీ నాయకులు తెలిపారు.