ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త అందించింది. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 378 ఎస్ఐ పోస్టులు, 1,156 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎస్ఐ పోస్టుల్లో సివిల్ విభాగంలో 253, ఏఆర్‌లో 116, ఎస్పీఎఫ్‌లో 9 పోస్టులు ఉన్నాయి.
అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ విభాగంలో 542, ఏఆర్‌లో 285, ఫైర్‌మ్యాన్ 158, జైలు వార్డర్స్ పురుషులు 150, మహిళలు 21 పోస్టులు ఉన్నాయి.
మొత్తం 1,534 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు, దరఖాస్తు విధానం, ప్రిలిమినరీ పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. అభ్యర్థులు అధికారిక ప్రకటనలో పేర్కొనే తేదీలు, అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం తదితర వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.