బోగోలులో మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో సుమారు మూడు టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టుబడినట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ధర్మాజీగూడెం ఎస్సై కె. వెంకన్న సిబ్బందితో కలిసి బోగోలు గ్రామంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ తనిఖీల్లో గ్రామానికి చెందిన చలమాల జోషి ఇంటి వద్ద సుమారు మూడు టన్నుల రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచడం, రవాణా చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, బియ్యం ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడికి తరలించేందుకు సిద్ధం చేశారు, కేసులో మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై అధికారికంగా పూర్తి సమాచారం వెల్లడికావాల్సి ఉంది.