BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 04:06 pm
Posted by : KADARI RAMANA

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
14 Nov, 2026 - 04:06 PM
18 వీక్షణలు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా

జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా కోరారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ప్రధాన సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఈ పథకం కింద ప్రతి కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడికి జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. లబ్ధిదారుల వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల స్థాయిలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ శిబిరాల ద్వారా అర్హులైన కుటుంబాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, బీమా రక్షణ పొందే ప్రధాన సంపాదనపరుడి వివరాలు, నామినీ వివరాలతో కూడిన దరఖాస్తులను సేకరించినట్లు తెలిపారు.

నామినీగా పేర్కొన్న వ్యక్తి మైనర్ అయితే, వారి సంరక్షకుడి వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆధార్ వివరాలు, నామినీ సమాచారం సహా అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

సేకరించిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో నమోదు చేసి, స్కాన్ చేసిన ప్రతులను సంబంధిత బీమా సంస్థకు పంపించడంతో పాటు అసలు దరఖాస్తులను జిల్లా స్థాయిలో భద్రపరిచినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పథకం అమలులో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంలో అర్హులైన వారందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.