కనిగిరిలో ఎల్ఈడీ స్క్రీన్‌పై అమరజీవి జలధార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి: జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని కనిగిరిలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలపై ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వివరాలను తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.