BREAKING
thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన
Date of Publish : 09 October 2026, 08:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 08:54 PM
13 వీక్షణలు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గత రెండు నెలలుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సైతం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.