BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 24 March 2026, 06:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు… దండకారణ్యంలో సంచలనం!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 06:04 PM
239 వీక్షణలు

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు… దండకారణ్యంలో సంచలనం!

దండకారణ్యం అరణ్య ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు, పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్‌గా పనిచేస్తున్న పాపారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు సుమారు 12 నుండి 17 మంది మావోయిస్టు సభ్యులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు.

దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన పాపారావు లొంగుబాటు ఇప్పుడు భద్రతా వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. అతని ఆధ్వర్యంలో అనేక కీలక ఆపరేషన్లు జరిగాయని సమాచారం.

ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు చేపట్టిన పునరావాస పథకాలు, భద్రతా బలగాల కట్టుదిట్టమైన చర్యలు, అలాగే అడవుల్లో పెరిగిన ఒత్తిడి కారణంగా మావోయిస్టులలో నిరుత్సాహం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇదే కారణంగా పలువురు నేతలు లొంగుబాటుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం.

పాపారావు లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.