BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 07:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేడూరు రైతులు పట్టాదారు పాసుపుస్తకాల్లో వివరాలు సరిచూసుకోవాలి: ఆర్డీఓ ఏ. కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:20 AM
6 వీక్షణలు

గంపలగూడెం మండలం మేడూరు రెవెన్యూ గ్రామంలో భూముల సమగ్ర సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రైతులకు డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. రైతులకు ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి ఖచ్చితత్వంతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలనే లక్ష్యంతో ముందస్తుగా ముసాయిదా పాసుపుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మేడూరు గ్రామ సచివాలయంలో జరుగుతున్న డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాల పరిశీలన ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రైతులు తమకు అందించిన ముసాయిదా పాసుపుస్తకాల్లోని ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతుల ఫొటో, పేరు, తండ్రి పేరు, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు, చిరునామా, భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, భూమి కొలతలు తదితర వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని తెలిపారు. వివరాల్లో ఏవైనా తప్పులు, వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు తెలియజేసిన అభ్యంతరాలను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం అవసరమైన సవరణలు చేపడతామని స్పష్టం చేశారు. పాసుపుస్తకాల్లో చిన్నపాటి పొరపాట్లు కూడా భవిష్యత్తులో భూముల లావాదేవీలు, ఇతర ప్రభుత్వ సేవల సమయంలో రైతులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నందున ముందుగానే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, భూమికి సంబంధించిన అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేసిన ఖచ్చితమైన పట్టాదారు పాసుపుస్తకాలు అందించడమే ఈ పరిశీలన కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆర్డీఓ ఏ. కుమార్ పేర్కొన్నారు. మేడూరు గ్రామ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ముసాయిదా పాసుపుస్తకాల్లోని వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.