BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 16 August 2026, 07:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మైలవరం ఏసీపీ రామచంద్రరావుకు ఉత్తమ సేవా పథకం అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:05 AM
68 వీక్షణలు

మైలవరం ఏసీపీ రామచంద్రరావుకు ఉత్తమ సేవా పథకం అవార్డు

మైలవరం: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో మైలవరం డివిజన్ ఏసీపీ పి. రామచంద్రరావు ఉత్తమ సేవా పథకం అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించినందుకు ఈ పురస్కారం లభించింది.

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఏసీపీ రామచంద్రరావు ఈ అవార్డును స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు.

విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, సమర్థవంతమైన నాయకత్వంతో మైలవరం డివిజన్‌లో పోలీస్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఏసీపీ చేస్తున్న కృషి అభినందనీయమని పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు.

ఈ అవార్డు మైలవరం డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తానికి గర్వకారణమని, ఏసీపీ రామచంద్రరావు సేవలు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా మైలవరం డివిజన్ పోలీసుల తరఫున ఏసీపీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకుని పోలీస్ శాఖకు, మైలవరం డివిజన్‌కు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.