BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 23 August 2026, 07:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మదనపల్లె: ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 07:06 PM
54 వీక్షణలు

మదనపల్లె: అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

మదనపల్లె, ఆగస్టు 23:

ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో బ్రిటీష్ తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు.

ప్రకాశం పంతులు ధైర్యం, నిస్వార్థ ప్రజాసేవ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఆర్ఎస్ఐలు శ్రీనివాస్, మగ్బుల్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.