BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 09:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో ఈ విద్యా సంవత్సరంలోనే జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల తరగతులు ప్రారంభం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 09:32 PM
52 వీక్షణలు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను జేఎన్‌టీయూ అధికార బృందం శనివారం సందర్శించి, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక వసతులను పరిశీలించింది.

ఈ సందర్భంగా ఎస్‌బీటీఈటీ కార్యదర్శి పుల్లయ్య, జేఎన్‌టీయూ మందని ప్రిన్సిపాల్ డా. విష్ణువర్ధన్, జేఎన్‌టీయూ సభ్యులు, మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె. సాంబయ్య, జనరల్ హెడ్ వినోద్ కుమార్ కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

అనంతరం అధికారులు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం నుంచే మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో బీటెక్ తొలి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు పాలిటెక్నిక్ కళాశాలలోనే తాత్కాలికంగా ఇంజనీరింగ్ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సూరంశెట్టి కిషోర్, షేక్ జహంగీర్ జేఎన్‌టీయూ అధికారులను కలిసి, మధిరలో ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.