ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. 15 తులాల బంగారం మాయం
NTODAY NEWS : కోదాడ
రూ.25 లక్షల విలువైన బంగారం అపహరణ.. పోలీసుల దర్యాప్తు
కోదాడ: ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగిన ఘటన కోదాడలో బుధవారం చోటుచేసుకుంది. హుజూర్‌నగర్‌కు చెందిన తోలుపునూరి పద్మావతి, సూర్యప్రకాశ్ కోదాడలోని రంగా థియేటర్ వద్ద మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్కారు.
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి బ్యాగులో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించినట్లు బాధితులు తెలిపారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బంగారం చోరీకి గురైన విషయం తెలిసి బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సులో ప్రయాణించిన వారిని, పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
కార్టూన్ పిక్చర్ ను రెడీ చేసి ఇవ్వండి