BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు సమస్యలపై నవంబర్ 28న విజయవాడలో భారీ నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:47 PM
14 వీక్షణలు

లెనిన్ సెంటర్‌లో రైతాంగ సమీకరణకు రైతు సంఘాల నిర్ణయం.. కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్

విజయవాడ (ఎన్ టుడే న్యూస్):

రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని రైతు సంఘాలు విమర్శించాయి. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 28న విజయవాడ లెనిన్ సెంటర్‌లో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి నిరసన ఆందోళన నిర్వహించనున్నట్లు రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.

విజయవాడ ప్రెస్ క్లబ్‌లో వై. కేశవరావు అధ్యక్షతన వామపక్ష రైతు సంఘాల జాయింట్ సమావేశం నిర్వహించారు. రైతాంగ సమస్యలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలభారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ మాట్లాడుతూ, ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ రైతు సంఘాల నేతలకు ఇచ్చిన రాతపూర్వక హామీలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.

రైతాంగ ఉద్యమం ప్రారంభమై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రైతుల హక్కుల సాధన కోసం మరోసారి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 28న విజయవాడ లెనిన్ సెంటర్‌లో భారీ నిరసన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, రైతాంగ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 736 మందికి పైగా అమరుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతుల రుణభారాన్ని తగ్గించేందుకు రుణమాఫీ అమలు చేయాలని, 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు నెలకు రూ.10 వేల పింఛను అందించాలని కోరారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజువారీ వేతనాన్ని రూ.700కు పెంచాలని డిమాండ్ చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్న నాలుగు కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు.

పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు సారవంతమైన వ్యవసాయ భూములను కట్టబెట్టే విధానాలను ప్రభుత్వం విడనాడాలని హరినాథ్ డిమాండ్ చేశారు. రైతుల జీవనాధారమైన భూములను కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం వినియోగిస్తే సహించేది లేదని, ఈ విధానాలను నిలిపివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

రైతాంగ హక్కులు, వ్యవసాయ రంగ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 28న నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కేవీపీ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మరీదు ప్రసాద్, హరిబాబు, కృష్ణయ్య, తూమాటి మణికంఠేశ్వరరావు, రాంబాబు, గణేష్ బాబు తదితర రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.