BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 24 November 2026, 06:14 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మెగా రక్తదాన శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Nov, 2026 - 06:14 AM
4 వీక్షణలు

ప్రజాసేవతో పాటు ప్రాణదానానికి శ్రీకారం చుట్టిన పుంగనూరు 11వ వార్డు కౌన్సిలర్ డి. చందు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు:

పుంగనూరు పట్టణ మున్సిపాలిటీలోని 11వ వార్డు నక్కబండ నుంచి సీపీఐ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా ఎన్నికైన డి. చందు, సోమవారం కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదే రోజున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని శుభారం డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, యువత, పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే సంకల్పంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలని వారు పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ప్రజాసేవతో పాటు ప్రాణదానానికి ప్రాధాన్యతనిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. పదవిని కేవలం బాధ్యతగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మంచి పరిణామమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ డి. చందు మాట్లాడుతూ, “ప్రజాసేవే లక్ష్యం… ప్రాణదానమే మహోన్నత సేవ…” అనే నినాదంతో భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాల్లో యువత, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మున్నా, పట్టణ నాయకులు ఆసిమ్, గని, అయాన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.