BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 10:01 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఏకగ్రీవంగా ఎన్నికైనా వైస్ చైర్మన్ పదవి దక్కలేదని టీడీపీ మహిళా కౌన్సిలర్ ఆవేదన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Nov, 2026 - 10:01 PM
4 వీక్షణలు

10వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎం. ద్రాక్షాయణి రెడ్డి అసంతృప్తి.. పార్టీ నిర్ణయంపై ప్రశ్నలు

10వ వార్డు నుంచి టీడీపీ కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎం. ద్రాక్షాయణి రెడ్డి వైస్ చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఆ పదవి మరొకరికి కేటాయించడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌తో ఆమె వాగ్వాదానికి దిగుతూ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల చేత ఎన్నుకోబడిన వ్యక్తికే వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.

తనకు వైస్ చైర్మన్ పదవి దక్కకపోవడంపై తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె, కౌన్సిలర్ పదవి కూడా తనకు వద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ పరిణామం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఏకగ్రీవంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్ వైస్ చైర్మన్ పదవిని ఆశించడం, ఆ పదవి మరొకరికి దక్కడంతో అసంతృప్తి వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం పార్టీ అంతర్గత నిర్ణయాలు, పదవుల కేటాయింపుపై చర్చకు దారితీసింది.