హార్ముజ్‌లో ఐదుగురు భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై మిస్సైల్ అటాక్ జరిగింది.
అంతర్జాతీయం
అంతర్జాతీయం
న్యూఢిల్లీ: హార్ముజ్ జలసంధి సమీపంలో ఐదుగురు భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై మిస్సైల్ దాడి జరిగినట్లు సమాచారం. ట్యాంకర్‌లో ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్ పశ్చిమ ఆఫ్రికాలోని లోమే పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. దాడి అనంతరం భారతీయుల భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం.
మరోవైపు పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్‌కు సరుకులు తీసుకువస్తున్న 12 వాణిజ్య నౌకల్లో మొత్తం 163 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి వెల్లడించినట్లు సమాచారం. ఆయా నౌకల్లో ఉన్న భారతీయుల భద్రతపై అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.