BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 05:52 pm
Posted by : K MAHESH

ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్

తెలంగాణ
/ నల్గొండ / దేవరకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:52 PM
21 వీక్షణలు

పీఏ పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభం, గ్రామపంచాయతీ భవనాలకు భూమిపూజ

దేవరకొండ (ఎన్ టుడే న్యూస్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శనివారం పీఏ పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించడంతో పాటు నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేసి శంకుస్థాపనలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

మండలంలోని అంగడిపేట గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రాంపురం గ్రామంలోని నేనావత్ తండాలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పిల్లిగుండ్ల తండాలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం రూ.13 లక్షల నిధుల విషయమై జిల్లా కలెక్టర్‌తో ప్రజల సమక్షంలోనే ఫోన్‌లో మాట్లాడారు. పనులు త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలోని ఇతర సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చూడాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.

అనంతరం మాదారిగూడెం గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అదే గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి గూడెం గేటు వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగడం లేదని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రజల సమక్షంలోనే ఆర్టీసీ డీఎంతో ఫోన్‌లో మాట్లాడి ప్రయాణికుల ఇబ్బందులను వివరించారు. అక్కడ బస్సులు ఆగేలా సమస్యను పరిష్కరించాలని కోరగా, చర్యలు తీసుకుంటామని డీఎం హామీ ఇచ్చారు.

పిల్లిగుండ్ల తండాలోనూ మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సమస్యల పరిష్కారం, పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చే సమస్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేర్మటి సతీష్ రెడ్డి, ఏవీ రెడ్డి, కుక్కల గోవర్ధన్ రెడ్డి, వీరబోయిన ఎల్లయ్య యాదవ్, మద్దిమడుగు రామస్వామి, తేరా సత్యం రెడ్డి, వంగాల ప్రతాపరెడ్డి, పాల్వాయి వెంకట్ రెడ్డి, బోడ్య నాయక్, తూటిపల్లి నగేష్, మావిల్ల లక్ష్మీనారాయణ, రామావత్ చిరంజీవి, నేనావత్ అనిత లక్ష్మణ్, ఇస్లావత్ బుజ్జి నాగు నాయక్, రాగం అంజయ్య, రామావత్ నారాయణ, మండల సర్పంచులు, ఉపసర్పంచులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.