BREAKING
thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు
Date of Publish : 24 September 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షంలోనూ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 07:30 PM
10 వీక్షణలు

వర్షంలోనూ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే స్పందన డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించిన కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు: భారీ వర్షాలతో తిరువూరు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిశీలించారు. బైపాస్‌ ప్రాంతంలోని ఆల్ఫా టీ స్టాల్‌ సెంటర్‌ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో అక్కడికి చేరుకున్న ఆయన పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజీలో మట్టి, చెత్త పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడటాన్ని గుర్తించిన ఎమ్మెల్యే వాటిని స్వయంగా తొలగించారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరువూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ప్రధాన రహదారులపై కూడా నీరు నిలవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన ఎమ్మెల్యే, నీరు సజావుగా వెళ్లేందుకు అడ్డుగా ఉన్న చెత్త, మట్టిని తొలగించే చర్యలు చేపట్టారు.

డ్రైనేజీ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించడం వల్ల తక్షణ పరిష్కార చర్యలకు అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు.