BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:53 pm
Posted by : K MAHESH

ఏజెన్సీ గ్రామాల్లో మూడు దశాబ్దాలకుపైగా విద్యాబోధన..

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 06:53 PM
14 వీక్షణలు

ఆదర్శ ఉపాధ్యాయుడిగా మోత్కూరి వెంకటేశ్వర్లు

మారుమూల గిరిజన గ్రామాల్లో సేవలు.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు రాష్ట్రస్థాయి గుర్తింపు

మహబూబాబాద్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): మారుమూల గిరిజన గ్రామాల్లో మూడు దశాబ్దాలకుపైగా ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ మోత్కూరి వెంకటేశ్వర్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. పదోన్నతులు, బదిలీల కోసం ప్రయత్నాలు చేయకుండా ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యాబోధన అందించడానికే తన ఉద్యోగ జీవితంలో ఎక్కువ భాగాన్ని కేటాయించారు.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరి వెంకటేశ్వర్లు 1996 డీఎస్సీలో అర్హత సాధించి బయ్యారం మండలం బాలాజీపేటలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. అక్కడ నాలుగేళ్లు, జగ్గుతండా యూపీఎస్ రంగాపురంలో తొమ్మిదేళ్లు, గార్ల, ముల్కనూరు ప్రాంతాల్లో తొమ్మిదేళ్లు, వెంకట్రాంపురంలో గత తొమ్మిదేళ్లుగా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో గార్ల, బయ్యారం ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల గిరిజన విద్యార్థులకు విద్యాబోధన అందించారు.

ప్రస్తుత రోజుల్లో కొందరు ఉపాధ్యాయులు ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతకాలం పనిచేసిన తర్వాత పట్టణ ప్రాంతాలకు బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, వెంకటేశ్వర్లు మాత్రం తన సర్వీసులో ఎక్కువ కాలం గిరిజన గ్రామాల్లోనే పనిచేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఉపాధ్యాయుడిగానే కాకుండా 2023, 2026 సంవత్సరాల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మానిటరింగ్ అధికారిగా (ఏఏంఓ) కూడా విధులు నిర్వహించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా 2019లో అప్పటి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 2020లో రాష్ట్రస్థాయి స్వచ్ఛంద సంస్థ అందించే గురుబ్రహ్మ అవార్డుకు కూడా ఎంపికయ్యారు.

మూడు దశాబ్దాలకుపైగా మారుమూల గిరిజన గ్రామాల్లోని విద్యార్థులకు విద్యాబోధన అందిస్తూ, పలు తరాల విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న మోత్కూరి వెంకటేశ్వర్లు సేవలను గుర్తించి ప్రభుత్వం మరిన్ని అవార్డులతో సత్కరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.