కస్టడీ తీర్పు తర్వాత కూతురిని కాల్చి చంపి తల్లి ఆత్మహత్య
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చైల్డ్ కస్టడీ వివాదంలో కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే ఓ తల్లి తన కుమార్తెను తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
చైల్డ్ కస్టడీ కేసులో కుమార్తె వివియన్ ప్రాథమిక కస్టడీని తండ్రి ఆరోన్ సెవెల్లాకు అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. తల్లికి కుమార్తెను పర్యవేక్షణలో మాత్రమే కలిసే అవకాశం కల్పించినట్లు సమాచారం.
ఈ తీర్పుతో మనస్తాపానికి గురైన సిబెల్లా సెవెల్లా (35) తన కుమార్తెను తుపాకీతో కాల్చిన అనంతరం అదే ఆయుధంతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.