బొల్లిన కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ పురందేశ్వరి
దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ అధ్యక్షుడు, విద్యాదాత బొల్లిన రామకృష్ణారావు మృతి పట్ల రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సంతాపం వ్యక్తం చేశారు.
యర్నగూడెంలోని బొల్లిన రామకృష్ణారావు నివాసానికి చేరుకున్న ఎంపీ పురందేశ్వరి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, రామకృష్ణారావు మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్ తదితర కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, మాజీ జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ, దేవరపల్లి మండల బీజేపీ నాయకులు దున్న సుమన్ బాబు, కోలా రామకృష్ణ, మండ జనార్దన్ రావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొల్లిన విజయభాస్కర్, నీటి సంఘం అధ్యక్షుడు పుట్టా రామారావు, ఓరుగంటి వెంకటపతి రాజు, గుత్తికొండ శ్రీనివాస్, మోతుకూరి భాస్కర్, నిమ్మగడ్డ శ్రీనివాస్, బొట్టా శ్రీరామకృష్ణ, పుట్ట రాజేష్, లక్క గణపతి, పుట్ట హరిప్రసాద్, కరికొల్ల శేషు, మహిళా మోర్చా నాయకులు పుట్టా వెంకటలక్ష్మి, కోలా మాధవి తదితరులు పాల్గొన్నారు.