BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఎంపీపీ వెంకన్న, వైస్ ఎంపీపీ యోహాన్‌కు ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:19 PM
20 వీక్షణలు

**ఎంపీ కేశినేని చిన్ని చేతుల మీదుగా ప్రజాప్రతినిధులకు అభినందనలు**

**ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు:**తిరువూరులో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు (వెంకన్న), వైస్ ఎంపీపీ యోహాన్‌తో పాటు ఎంపీటీసీల అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు (వెంకన్న)ను ఎంపీ కేశినేని చిన్ని శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అలాగే నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు అభినందనలు తెలియజేశారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన వారంతా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

అనంతరం సభను ఉద్దేశించి ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎంపీ కేశినేని చిన్ని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.