దర్శిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
దర్శి: దర్శి పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సీఈసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఎన్నికల సన్నద్ధత, వార్డుల వారీగా పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించినట్లు సమాచారం.