BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 08:16 pm
Posted by : V శ్రీనివాస్

​నీట్ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల నివాళి.. మంత్రి రాజీనామా యువత విజయమే

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
25 Jul, 2026 - 08:16 PM
197 వీక్షణలు

​నీట్ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల నివాళి.. మంత్రి రాజీనామా యువత విజయమే

నీట్ పేపర్ లీకేజీతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంచిర్యాలలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఢిల్లీలో అభిజిత్ దీప్కే, సోనమ్ వాంగ్ చుక్ ల ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన శాంతియుత పోరాటాన్ని అణచివేసేందుకు కేంద్రం పోలీసులతో దాడులు చేయించినా యువత బెదరలేదన్నారు. ఈ ఉద్యమ ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఇది ముమ్మాటికీ దేశ యువత, ప్రజాస్వామ్య విజయమని వారు హర్షం వ్యక్తం చేశారు.

​ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి, ప్రజల అభీష్టం మేరకే పాలన సాగించాలని సూచించారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని, ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, లాఠీఛార్జ్ చేసిన ఢిల్లీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'పోరాడితే పోయేది ఏమీ లేదు మన బానిస సంకెళ్లు తప్ప' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కార్యదర్శులు ఏ. రాజేశం, రాజిరెడ్డి, జి. లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్, పోషన్న, బాపు, సత్యనారాయణ, బి. మల్లయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు