BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 02:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన.. హనుమాన్ చాలీసా పారాయణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 02:32 PM
86 వీక్షణలు

గంపలగూడెం నవంబర్ 8: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. లోకకళ్యాణం, సర్వలోక శాంతిని కాంక్షిస్తూ ఆదివారం సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా శివాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి మందిరం వద్ద భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి మందిరం నుంచి రేడియో రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా నగర సంకీర్తన కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు 'ఓం సాయి, శ్రీ సాయి, జయజయ సాయి', 'శ్రీరామ, జయరామ, జయజయరామ' నామస్మరణతో గ్రామ వీధులను ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పెనుగొలనులో భక్తి పారవశ్యంతో హనుమాన్ చాలీసా పారాయణం పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద కొలువుదీరిన అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారిని స్మరించుకున్నారు. అనంతరం అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పసుమర్తి లక్ష్మణరావు, రాళ్లచర్ల జగన్నాథం, రంగా శేషగిరి పర్యవేక్షించారు.