BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 08 April 2026, 10:37 pm
Posted by : V శ్రీనివాస్

​నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 10:37 PM
190 వీక్షణలు

​నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరిక

​మంచిర్యాల, ఏప్రిల్ 08: జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, ఏడీ సురేఖ మరియు ఇతర అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులకు కలిగే నష్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే దళారులు, విక్రయదారులపై నిఘా ఉంచి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నదాతలను మోసం చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.