BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:50 PM
32 వీక్షణలు

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 19: తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం గ్రామంలోని శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గ్రంథాలయ అధికారిణి జ్యోతిర్మయి మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో బ్యాంకులను జాతీయీకరణ చేశారని వివరించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, సామాజిక, ఆర్థిక సమానత్వానికి కృషి చేసిన నాయకురాలిగా ఇందిరా గాంధీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆమె జీవితం, ప్రజాసేవ, దేశానికి చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడం, గ్రంథాలయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించగా, వివిధ పాఠశాలలకు చెందిన బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వారం రోజులపాటు విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారిణి జ్యోతిర్మయి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం నిర్వహించే ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. పుస్తక పఠన సంస్కృతిని పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే గ్రంథాలయ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.