BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధిలో నూతన నాయకత్వం కీలక పాత్ర పోషించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:02 PM
21 వీక్షణలు

ఎంపీపీ గురజాల వెంకట శివకుమారి, వైస్ ఎంపీపీ చింతల లక్ష్మీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు అభినందనలు ఇబ్రహీంపట్నం: మండల సమగ్ర అభివృద్ధిలో నూతన నాయకత్వం కీలక పాత్ర పోషించాలని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ నూతన అధ్యక్షురాలిగా గురజాల వెంకట శివకుమారి, ఉపాధ్యక్షురాలిగా చింతల లక్ష్మీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులను అలంకారప్రాయంగా భావించకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. మండలంలోని గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పేర్కొన్నారు. సమన్వయంతోనే సమగ్ర అభివృద్ధి ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో నూతన నాయకత్వం చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన గురజాల వెంకట శివకుమారి, చింతల లక్ష్మీ సమర్థవంతమైన నాయకత్వంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో ఇబ్రహీంపట్నం మండలం అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆశాభావం వ్యక్తం చేశారు.