BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:25 am
Posted by : K MAHESH

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి

తెలంగాణ
/ వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:25 AM
24 వీక్షణలు

అప్పటివరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి: రామ రాజేష్ ఖన్నా

నర్సంపేట, నవంబర్ 8 (ఎన్ టుడే న్యూస్): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సర్కిల్ వద్ద కొనసాగుతున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 27వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చాలాకాలంగా ప్రజారోగ్య సేవల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులందరికీ 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

27 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతున్నప్పటికీ తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపాలని ఉద్యోగులు కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ టీ. భరత్ కుమార్, డాక్టర్ గుండా రవీందర్, డాక్టర్ వి. మోహన్ రావు, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రామ్ రాజు, డాక్టర్ నిఖిల్, నర్సంపేట పల్లె దవాఖాన వైద్యుడు డాక్టర్ శ్రవణ్ కుమార్, నర్సంపేట టీ-హబ్ ఫార్మసిస్ట్ బిర్రు సప్న, ఈవిన్ మేనేజర్ రవీందర్, డైకు మేనేజర్ మేర్గు అనిల్ కుమార్ పాల్గొన్నారు.

అలాగే నర్సింగ్ ఆఫీసర్లు మేకల మంజుల, సుమలత, కళ్యాణి, ఫార్మసీ ఆఫీసర్ నూకల అంజి యాదవ్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కోర్నెల్, వైకుంఠం, అకౌంటెంట్లు ఎం. శ్రీనివాస్ బాబు, టీబీ విభాగానికి చెందిన రంజిత్, రాకేష్, ఏఎన్‌ఎంలు దాసరి నర్మద, సంధ్య, జ్యోతి, సుల్తానా, పేనీన, ఉప్పలమ్మ, శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్లు జూకంటి మౌనిక, ప్రవీణ్, ఎంఎన్‌ఓ ఏకుల చిరంజీవి, సపోర్టింగ్ స్టాఫ్ గూడెపు ప్రభాకర్‌తో పాటు పలువురు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.