పెరుగుపల్లిలో నిషిత పుట్టినరోజు వేడుకలు
వెలిగండ్ల, సెప్టెంబర్ 25: కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ చిన్న కుమార్తె దద్దాల నిషిత పుట్టినరోజు వేడుకలను శుక్రవారం సాయంత్రం వెలిగండ్ల మండలం పెరుగుపల్లి గ్రామంలో నిర్వహించారు.
గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి నిషితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దద్దాల నారాయణ యాదవ్ సతీమణి, మాజీ సర్పంచ్ దద్దాల మంజు భార్గవి పెరుగుపల్లి గ్రామంతో పాటు ఎస్సీ కాలనీలో సుమారు 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దద్దాల రాములు, వైస్ సర్పంచ్ ఏకుల ఆదిలక్ష్మి, కన్నాటి వెంకటరెడ్డి, తమ్మినేని శివరామిరెడ్డి, కర్నాటి ప్రభాకర్, తమ్మినేని గోవిందయ్య, ఉండేల మాలకొండయ్య, తమ్మినేని పెద్దిరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, ఏకుల వెంకటేశ్వర్లు, పల్నాటి ఎల్లయ్య, పల్నాటి చిన్న ఎల్లయ్య, పండ్లగండ్ల తిరుపాలు, వేల్పుల శీను, దద్దాల మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.