మేడూరులో నిత్య అన్నదాన కమిటీ ఏర్పాటు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని శ్రీ కాత్యాయని జీవన్ముక్తేశ్వర సాయి రామయోగేంద్ర హనుమంత్ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ అన్నదాన కమిటీని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ పీఠాధిపతి శ్రీ లీల బాల రామయోగేంద్ర స్వామి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, భక్తులు, పీఠాధిపతుల సమక్షంలో కమిటీ ఏర్పాటు ప్రక్రియ నిర్వహించారు.
ఆలయంలో నిత్య అన్నదానం కొనసాగించడం, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం, ఆలయ నిర్వహణను సమన్వయంతో నిర్వహించడం కమిటీ ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు. గ్రామ పెద్దలు బాతోటి వెంకటేశ్వరరావు, కుంద మాస్టర్ తదితరుల సమక్షంలో వారి అంగీకారంతో కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అన్న ప్రసాద నిర్వహణ కమిటీ సభ్యులు:
బొప్పన శ్రీనాథ్
ముత్యాల వీరభద్రరావు
నాగోల్ గోవర్ధన్ రావు
చావా సోమేశ్వరరావు
గళ్ళ సంగయ్య
పరిగెల నాగేశ్వరరావు
మందడపు ప్రసాద్
వేముల కుప్పు స్వామి
తమ్మెన హరికృష్ణ
కిలారి ఝాన్సీ
యద్దనపురి కనకయ్య
కమిటీకి ఉమ్మడి ఖాతాదారులుగా బొప్పన శ్రీనాథ్, చావా సోమేశ్వరరావులను నియమించారు. ఈ కమిటీ కాలపరిమితి 2026 సెప్టెంబర్ 22 నుంచి 2027 సెప్టెంబర్ 21 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఆలయ అభివృద్ధి, నిర్వహణకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయనున్నట్లు పేర్కొన్నారు.