APPSC FRO పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష, రాత పరీక్ష, నడక పరీక్షతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు వేతనం అందుతుంది. ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఖాళీల సంఖ్య, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను APPSC అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.