BREAKING
thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు
Date of Publish : 05 October 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉల్లి రైతులను ఆదుకోవాలి...

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 06:41 AM
5 వీక్షణలు

క్వింటాకు రూ.3,500కు తగ్గకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

వ్యాపారుల సిండికేట్‌తో ధరలు పతనం.. రైతులకు తీవ్ర నష్టం

మైదుకూరు: ఉల్లి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు డిమాండ్ చేశారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పంట అధికంగా సాగు చేసిన మండలాల్లోని మార్కెట్ యార్డులలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీపీఐ నాయకులు మైదుకూరు మండలం అక్కులాయిపల్లె గ్రామంలో ఉల్లి సాగు చేసిన రైతులు అందె వెంకటసుబ్బయ్య, మైలారు శ్రీనివాసులు, మైలారు వెంకటేశ్వర్లు తదితరులను కలిసి పంట సాగు, దిగుబడి, ప్రస్తుత మార్కెట్ ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వి. సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి. శ్రీరాములు, మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి ఎస్. షా వల్లి మాట్లాడుతూ కడప జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో, మైదుకూరు మండలంలో 2,400 ఎకరాల్లో ఉల్లి సాగు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది పంట దిగుబడి ఒక మోస్తరుగా వచ్చినప్పటికీ, తొలుత మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు కొంత ఊరట చెందారని పేర్కొన్నారు. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారి కొనుగోలు ధరలను ఒక్కసారిగా తగ్గించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో క్వింటాకు రూ.4,500 వరకు ఉన్న ధరను ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.2,500కే కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారని తెలిపారు. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలను సాకుగా చూపుతూ ధరలను అమాంతం తగ్గిస్తున్నారని ఆరోపించారు. వర్షాల కారణంగా ఉల్లి పంటకు గణనీయమైన నష్టం జరిగినట్లు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని, అయినప్పటికీ ధరలు తగ్గించడంతో రైతులు పెట్టుబడులు కూడా తిరిగి పొందలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు ఖర్చులు, కూలీల ఖర్చులు, ఇతర పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో మార్కెట్‌లో ధరలు పడిపోవడం రైతులకు మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది ఎదురైన నష్టాలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న మండల కేంద్రాల్లోని మార్కెట్ యార్డులలో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్వింటాకు రూ.3,500 కంటే తక్కువ కాకుండా ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు పంటను నిల్వ చేసుకునేందుకు అవసరమైన శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉల్లి రైతులను ఆదుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళనలు, పోరాటాలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మైదుకూరు పట్టణ కార్యదర్శి డి. సుబ్బరాయుడు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు బి. పీరయ్య, రైతు సంఘం నాయకుడు వై. సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.