ఓటర్ల జాబితా అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒవైసీ
తెలంగాణ
ఎన్నికల సంఘం చేపట్టిన ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనలు పాటించకుండా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారని ఆయన పిటిషన్లో ఆరోపించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, సరైన విధానాలు అనుసరించకుండా జరుగుతున్న తొలగింపులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఈ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.