BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:24 am
Posted by : K MAHESH

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాల్లో మా ఇంటి దీపావళి వేడుకలు

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:24 AM
26 వీక్షణలు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి దీపాలు వెలిగించిన లబ్ధిదారుల కుటుంబాలు

నర్సంపేట, నవంబర్ 8 (ఎన్ టుడే న్యూస్): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలో ‘మా ఇంటి దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన కోటగిరి ప్రేమలత–భాస్కర్, మమత–రవీందర్, కక్కెర్ల ఉమ–శ్రీనివాస్ కుటుంబాల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే, కలెక్టర్ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందని తెలిపారు. సొంత ఇల్లు అనేది ప్రతి నిరుపేద కుటుంబానికి ఎంతో ముఖ్యమైన కల అని, ఆ కలను నిజం చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని అన్నారు.

దీపావళి వంటి పండుగ సందర్భాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి వేడుకల్లో పాల్గొనడం ద్వారా వారి ఆనందంలో భాగస్వాములయ్యే అవకాశం లభించిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, ఆర్డీవో ఉమారాణి, హౌసింగ్ పీడీ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.