BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 01 July 2026, 12:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పానుగంటి చైతన్య రౌడీ షీటర్ కాదు.. ఉద్యమ యోధుడు: వైఎస్ఆర్సిపి విద్యార్థి నేత వినోద్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:01 PM
106 వీక్షణలు

అమరావతి రాజధాని ప్రాంత రైతులే ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మడం లేదని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆరోపించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మోసాలను గుర్తించిన రాజధాని రైతులు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ గుండాలు దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు.

పానుగంటి చైతన్యపై ఎక్కడ రౌడీ షీట్ ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా పానుగంటి చైతన్యపై దుష్ప్రచారం చేస్తోందని, ఆయన రౌడీ షీటర్ కాదని, ఉద్యమ యోధుడని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించిన వినోద్.. ప్రజల తీర్పుతో 2029లో తప్పకుండా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నేతలు భాను ప్రకాష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.