Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నంద్యాల | NTODAY NEWS
నేషనల్ హైవే 167K నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం తాలూకా వెలుగోడు మండలంలోని బోయరేవుల మరియు మోతుకూరు గ్రామాల మధ్య ప్రవహించే గాలేరు నదిపై నూతన వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
హైవే ప్రాజెక్టులో కీలకమైన ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, ప్రాంతీయ రవాణా వ్యవస్థకు ఊతమివ్వనుంది. నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ హైవే 167K పూర్తయిన తర్వాత శ్రీశైలం పరిసర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, వాణిజ్య రవాణా, స్థానిక అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.