BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 15 August 2026, 02:47 pm
Posted by : NTODAY NEWS

ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
15 Aug, 2026 - 02:47 PM
152 వీక్షణలు

ఆమడగూరు, ఆగస్టు 15 (ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు):

పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆమడగూరు మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ మారుతీ ప్రకాష్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శకుంతలమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అపర్ణ, ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈవో జిలాన్ బాషా, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ గోపాలకృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహం, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి, మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ శిరీష జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. పాఠశాలల్లో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు, స్థానికులను అలరించాయి.

అలాగే పలువురు ఆటో డ్రైవర్లు తమ ఆటోలను జాతీయ జెండాలతో ప్రత్యేకంగా అలంకరించి దేశభక్తిని చాటుకున్నారు.

వేడుకల్లో వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.